DIl Raju

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.
పూర్వ వైభవం తీసుకువస్తాం
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ… టీఎఫ్‌డీసీకి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలన్నారు. సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మరెంతో అభివృద్ధి చెందాలన్నారు. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా తనపై ఎంతో బాధ్యత ఉందని, ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేస్తానన్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా అవకాశమిచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు

Advertisements
Related Posts
Harish Rao: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఒక వేడి చర్చను తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టీ. హరీష్ రావు. ప్రస్తుత రేవంత్ Read more

వన దుర్గా మాతను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి జస్టిస్

ఏడుపాయల వనదుర్గామాత ను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి Read more

కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్
కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వరుస రైతు నిరసనలు చేయాలనీ ప్రణాళిక చేస్తుంది. Read more

ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.
ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.

జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ పన్ను బకాయిలపై ఉక్కుపాదం మోపుతోంది. మొండి బకాయిదారులపై కొరడా ఝళిపిస్తూ చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం Read more

×