ttd temple

తెలంగాణ ఎమ్మెల్యేకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపుల్లో ఈ మధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికార, విపక్ష పార్టీలు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నాయి. తొలుత ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా స్పందించారు. తిరుమలలో వివక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisements
 ttd temple


వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

Related Posts
డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
villagers rushed the pregnant woman to the hospital in Doli

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. Read more

మహిళా ఎస్సైపై యువకుల దాడి..చివరికి ఏమైంది?
గుడివాడలో మహిళా ఎస్సైపై దాడి.. పోలీసులు ఏం చేశారు?

విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో డాన్స్‌ Read more

Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

అభివృద్ధి దిశగా అమరావతికి కేంద్రం బలమైన మద్దతు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.4200 కోట్ల నిధులను విడుదల చేయడం ద్వారా అమరావతి నిర్మాణానికి ఊహించని ఊపిరి పోసింది. Read more

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu meets Union Ministers today

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు.అమరావతి: బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

×