srinivas

తెలంగాణపై వివక్ష వద్దు: శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్వాద వ్యాఖ్యలు చేసారు. దేవుడి ముందు అందరూ సమానమేనని… వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు.
సౌకర్యాలను కొనసాగించండి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రపంచంలోనే పేరుపొందిన ఆలయం అని ఇంత పవిత్రత కలిగిన ఆలయంలో వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు.

Advertisements
Related Posts
హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదం
బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న రమణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు Read more

పేర్ని నాని భార్యకు మరోసారి నోటీసులు
ycp perni nani

ఆంధ్రప్రదేశ్ లో పేర్ని నాని భార్యకు సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా రేషబ్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని Read more

Malla reddy: సమ్మర్ ట్రిప్ లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మల్లన్న దంపతులు
Malla reddy: సమ్మర్ ట్రిప్ లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మల్లన్న దంపతులు

జపాన్‌లో చిల్ మోడ్‌లో మల్లారెడ్డి దంపతులు డీజే టిల్లు కాదు.. ఈ సారి టోక్యో వీధుల్లో దుమ్ము రేపుతున్నది మన మల్లన్నే! మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే Read more

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

అల్లాదుర్గం( ప్రభాతవార్త) మార్చి 4. అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ సమీపంలోని 161 జాతీయ రహదారిపై కారు ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం Read more

×