cyclone 1

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఫెంగాల్ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

Advertisements

నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఫెంగాల్ తుపాను కదులుతుంది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతతంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Related Posts
గోదావరి నీళ్ల అంశం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
గోదావరి నీళ్ల అంశం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు

గోదావరి నీళ్ల అంశం ప్రస్తావించిన సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు స్పష్టం గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు విజయోత్సవంగా మంగళగిరి Read more

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!
Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు Read more

మాతృభాషను అందరూ మార్చిపోతున్నాం: కిషన్ రెడ్డి
Everyone is changing their mother tongue.. Kishan Reddy

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత Read more

రైతు భరోసా.. వాళ్లకు గుడ్ న్యూస్
rythu bharosa telangana

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఆసరాగా మారిన రైతు భరోసా పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం అమలులోకి రానుండగా, Read more

×