laddu

తిరుమల లడ్డూ కల్తీలో వెలుగులోకి కీలక విషయం

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్‌ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్‌ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించారని, లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్‌ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించారని, అనంతరం ఆ నెయ్యిని ఏఆర్‌ డెయిరీ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్‌ అధికారులు గుర్తించారు. ఆ ట్యాంకర్లు వెళ్లిన మార్గాలు, టోల్‌గేట్‌ వద్ద ఆగిన సమయాలు సహా అన్ని ఆధారాలను పక్కాగా సేకరించారు. జగన్ పాలనలో టీటీడీలో అవినీతి పనులు జరిగాయని టీడీపీ ఆరోపణ. ఈ దిశగా ఇక్కడి అవినీతి పై విచారణ జరుగుతుంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, దీనిపై విచారణకు సుప్రీం ఆదేశించండం జరిగింది. ఆ వివరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరించారు. అంతకుముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం తయారీకి సేకరిస్తున్న నెయ్యి, శనగపప్పు తదితర సరుకులతోపాటు వాటి నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, సరుకుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు.

Advertisements
Related Posts
ChandrababuNaidu: జనాభా పెరగడం అవసరమన్నచంద్రబాబు
ChandrababuNaidu: జనాభా పెరగడం అవసరమన్నచంద్రబాబు

ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అప్పట్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కుటుంబ నియంత్రణను Read more

అప్రమత్తంగా ఉండండి..సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం మరియు నాశనం చేసిన యెడల చట్టపరమైన చర్యలు..
Be alert.Legal action in case of excavation and destruction of natural gas pipelines

హిందూపూర్: హిందూపూర్ లో హౌసింగ్ బోర్డ్ కాలనీకి సమీపంలో, సాయిబాబా మందిరం వెనుక వైపు, ఏజి & పి ప్రథమ్ సంస్థ (AG&P Pratham) ద్వారా వేయబడిన Read more

Pawan Kalyan : బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తాను : పవన్ కళ్యాణ్
I will oppose any attempt to forcefully impose any language.. Pawan Kalyan

Pawan Kalyan : బలవంతంగా ఏ భాషను రుద్దే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సీట్లు Read more

CM Chandrababu: రేపు బిల్‌ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu Naidu to meet Bill Gates tomorrow

CM Chandrababu: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుదవారం) మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో Read more

×