త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో త‌న త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌ల్లి చేయి ప‌ట్టుకుని కేక్ క‌ట్ చేయించారు. కుమారుడిని ద‌గ్గ‌రకు తీసుకుని త‌ల్లి విజ‌య‌మ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. అంత‌కుముందు క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం చ‌ర్చికి చేరుకున్న జ‌గ‌న్‌కు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక ఇడుపుల‌పాయ ప్రేయ‌ర్‌ హాల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. గురు, శుక్ర‌వారం కూడా మాజీ సీఎం క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా కొత్త‌ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

Advertisements

Related Posts
జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల Read more

వైసీపీ వల్లే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆగింది : అమర్నాథ్‌
Gudivada Amarnath

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. ప్లాంట్‌ను కాపాడాలని Read more

గుంటూరులో శ్రీ రెడ్డిపై కేసు నమోదు
srireddy

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని Read more

ఎంపీ పిఎ రాఘవ రెడ్డి 41 ఏ నోటీసులు జారీ
MP PA Raghava Reddy 41 A no

పులివెందుల : సోషియల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ ల కేసులో ఎంపీ పిఏ బండి రాఘవ రెడ్డి ఇంటికి పోలీస్ లు వెళ్లి ఈనెల తొమ్మిదవ తేదిన Read more

×