new car

తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్ రాజి లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్‌తోపాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా, నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
జగన్ కు రాజకీయ పార్టీ అవసరమా..? – టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సూటి ప్రశ్న
jagan gurla

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కఠినంగా విమర్శలు చేశాడు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం Read more

టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
Caste census should be conducted in AP too.. YS Sharmila

అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం మీద మరోసారి విరుచుకుపడ్డారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, Read more

మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌
ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌

ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ఏపీకి వరం రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ రాబోతోందని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని Read more

ఏపీలో స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్
ఏపీలో స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రల ద్వారా విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *