हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

తగ్గదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు

Divya Vani M
తగ్గదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు

రీజినల్ సినిమా వైపు తిరిగి చూసే అవకాశం ఉండా? సినిమా రంగంలో ఎవరికైనా విజయం మెట్టుకు మెట్టుగా వస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కిన తర్వాత, ఆ పై మెట్టులపై దృష్టి పెట్టడం సహజం. కానీ ప్రయాణం చేసిన అడుగులపై ఒక్కసారైనా నిల్చుని చూసే ఆలోచన వస్తుందా? మన స్టార్ హీరోల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఉండదు. ఎవరికైనా పెద్ద అవకాశాలు ఎదురైతే, చిన్న స్థాయిలో పనులు చేయడానికి వీలు దొరుకుతుందా?సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సమయంలో, “ఇది నా చివరి రీజినల్ సినిమా కావొచ్చు” అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాజమౌళితో ఇంటర్నేషనల్ స్థాయి ప్రాజెక్ట్‌ చేస్తున్న మహేష్, భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ స్థాయి సినిమాలపైనే దృష్టి పెట్టడం ఖాయం. ఇదే సమయంలో ప్రభాస్ కూడా “బాహుబలి”తో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. అయితే ఆ సమయంలో ప్రభాస్‌కు అంత స్పష్టత లేకపోయినా, బాహుబలితో వచ్చిన రేంజ్ ఆయనను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది.ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే,ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన మార్కెట్ మరో స్థాయికి వెళ్లిపోయింది. దేవర తో పెరిగిన స్పాన్‌ను కొనసాగిస్తూనే,తర్వాత వార్ 2 తో మరింత ముందుకు అడుగులేశారు. నార్త్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన తారక్, ఒకసారి ఆగి రీజినల్ సినిమా చేయడానికి సమయం దొరుకుతుందా అనేది ప్రశ్న.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే “మర్యాద రామన్న”లాంటి చిన్న కథను తీసుకువచ్చారు. అలాంటి క్షణం మన హీరోలకు రాదా? అని సందేహం వస్తోంది. అల్లు అర్జున్ కూడా నెల్సన్‌ దర్శకత్వంలో ఒక రీజినల్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది. కానీ ప్రస్తుతం పుష్ప 2 విజయంతో ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు మాత్రమే ప్రధాన లక్ష్యంగా మారాయి.పెరిగిన మార్కెట్‌, విస్తరించిన రేంజ్‌లను దృష్టిలో పెట్టుకుని, చిన్న స్థాయి కథల వైపు తిరిగి చూసే అవకాశం స్టార్ హీరోలకు ఉండకపోవచ్చు. వాణిజ్య అంచనాలు ఈ దిశలో ఆలోచనలకు కొంత అవరోధంగా నిలుస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870