Alla Nani

టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని

వైసీపీకి దెబ్బమీదదెబ్బ తగులుతున్నాయి. ఈ పార్టీకి రాజీనామాల వరుసలు మొదలయ్యాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు.
వైసీపీకి చెందినవారంతా కూటమిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. వైసీపీ పార్టీ ప్రముఖులు టీడీపీ పార్టీలోకి వెళుతున్నారు. అయితే నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని… ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. కానీ, హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు.
రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని… ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం.

Advertisements
Related Posts
సంక్రాంతికి ఊరెళ్తున్నా వారు జాగ్రత్త..పోలీసుల హెచ్చరికలు
pongal

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎక్కువ మంది గ్రామాలకు వెళ్లడం, Read more

గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ
గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ

వైసీపీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ అత్యాచార Read more

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా – గవర్నర్ ప్రసంగం, వైసీపీ వాకౌట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ మరియు శాసనమండలిని ఉద్దేశించి Read more

జనసేనలో చేరడం పై తమ్మినేని సీతారాం క్లారిటీ
tammineni

వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. "నేను వైసీపీలోనే కొనసాగుతాను. జనసేనలో చేరాల్సిన Read more

×