eo and chariman

టీటీడీ ఛైర్మన్ తో విభేదాలు ?

తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ)ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట టీటీడీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు టీటీడీ ఎక్కడా చెప్పకపోవడం, ఛైర్మన్, ఈవో మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది.

Advertisements


తిరుపతి తొక్కిసలాట తర్వాత అక్కడ పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఛైర్మన్, ఈవో సమన్వయంతో పనిచేయాలని తేల్చిచెప్పేశారు. రివ్యూ మీటింగ్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఈ ఘటనపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో శ్యామలరావుకు గ్యాప్ ఉందన్న చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

అలాగే టీటీడీలో ఛైర్మనే కీలకమని, బోర్డు నిర్ణయాల్ని అదికారులు అమలు చేస్తారని కూడా వెల్లడించారు. మరోవైపు తిరుపతి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం భక్తుల్ని అనుమతించే విషయంలో కొన్ని లోపాలు జరిగాయని శ్యామలరావు అంగీకరించారు. అయితే ఛైర్మన్ కూ, తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని ఈవో స్పష్టం చేశారు. తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts
వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు
ఆండాళ్‌ అమ్మవారి

ఫిబ్ర‌వ‌రి 23న ఆండాళ్‌ అమ్మవారి స్వర్ణ రథోత్సవం. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ‌నివారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో Read more

Pawan Kalyan : కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan కుమారుడు పై స్పందించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ వార్త వెలువడే Read more

పోసాని పై ఫిర్యాదు ఇప్పటిది కాదు:జోగిమణి
పోసాని పై ఫిర్యాదు ఇప్పటిది కాదు:జోగిమణి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత Read more

25న గోదావరి బోర్డు భేటీ.. ‘బనకచర్ల’పై చర్చ
Godavari Banakacherla

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఈ నెల 25న కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో Read more

×