ttd temple

టీటీడీకి నూతన ఈవో, ఏఈవో?

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులులకు ఆరాధ్యదైవం. టీటీడీ ప్రక్షాళన కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల బాధ్యత టీటీడీ పై ఉంది. టీటీడీలో ఛైర్మన్, ఈవో, ఏఈవో ది కీలక పాత్ర. తిరుమల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుపతి లో తొక్కిసలాట వేళ తిరుమల లో చోటు చేసుకుంటున్న పరిణామాల పై చంద్రబాబు, పవన్ ఆగ్రహంగా ఉన్నారు.

Advertisements

టీటీడీలో పూర్తి స్థాయిలో మార్పులు జరగాలని పవన్ డిమాండ్ చేసారు. ఈవో, ఏఈవో పైన సీరియస్ అయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే ఛైర్మన్ – ఈవో వాగ్వాదం ను సీఎం తీవ్రంగా పరిగణించారు. దీంతో, ఈ రోజు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు పూర్తయిన తరువాత ఈవో..ఏఈవో మార్పు ఖాయమని తెలుస్తోంది. ఈవోగా కీలక అధికారి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చంద్రబాబు – పవన్ సీరియస్ తాజా ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేసారు. తాజా ఘటన పైన పవన్ భక్తులకు క్షమాపణ చెప్పారు. లక్షలాది భక్తులు హాజరయ్యే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పైన 15 సమావేశాలు జరగ్గా.. వాటిల్లో ఛైర్మన్ – ఈవో కలిసి ఒకే సారి పాల్గొనటం ద్వారా ఏ స్థాయిలో వీరి మధ్య గ్యాప్ ఉందనేది స్పష్టం అవుతోంది. ఈవో శ్యామలరావు, చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారు తామదే నిర్ణయాధికారం అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. కొద్ది రోజుల క్రితం ఛైర్మన్ నాయుడు సీఎం చంద్రబాబు ను కలిసి ఈవో పై ఫిర్యాదులు చేసారు. పవన్ సైతం వీరి విషయంలో గుర్రుగా ఉన్నారు. దీంతో, ప్రస్తుతం సీఎంఓలో పని చేస్తున్న కీలక అధికారికి టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. శ్యామలారావును తిరిగి గతం లో పని చేసిన శాఖకు పంపే ఛాన్స్ ఉందని సమాచారం.

Related Posts
Gas Leak : నెల్లూరులో అమోనియా గ్యాస్ లీక్ కలకలం
Gas Leak : నెల్లూరులో అమోనియా గ్యాస్ లీక్ కలకలం

నెల్లూరులో గ్యాస్ లీక్ కలకలం: వాతావరణాన్ని కమ్మిన భయంలా అమోనియా నెల్లూరు జిల్లాలోని టీపీగూడూరు మండలంలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం జరిగిన Read more

Chebrolu Kiran: జగన్ భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్
వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త అరెస్ట్

జగన్ భార్య వైఎస్ భారతి పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ Read more

YCP: వైసీపీ లక్ష్యంగా కూటమి వేగంగా అడుగులు
వైసీపీ లక్ష్యంగా కూటమి వేగంగా అడుగులు

ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అయితే, మొత్తం ఫలితాలను పరిశీలిస్తే, Read more

Rammohan Naidu: యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు కు ఎంపికైన రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు కు ఎంపికైన రామ్మోహన్ నాయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల 'ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్' నుండి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు Read more

×