రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్ లో హవా చేస్తోంది.మొదటగా తెలుగు ఇండస్ట్రీలో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు చిన్నగా ఉన్న ఈ ట్రెండ్, ఇప్పుడు పెద్ద విజయంగా మారింది.పాత సినిమాలు మళ్లీ థియేటర్లలో చూపించడం, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందడం చూస్తున్నాం.మూడేళ్ల క్రితం,మహేష్ బాబుకు సంబంధించి పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు.ఈ సినిమా కి వచ్చిన స్పందనను చూసిన తర్వాత, ఇండస్ట్రీలో సుమారు 40 సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి.తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా గిల్లి వంటి పాత సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఈ ట్రెండ్‌లో భాగమైంది. ఇటీవల కాలంలో, బాలీవుడ్‌లో పాత సినిమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది.
అభిమానులు తమ అభిమాన నటుల సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసి ఆనందం పొందుతున్నారు. 2024లో, బాలీవుడ్ నుంచి రీ రిలీజ్‌ల ద్వారా 65 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.వాటిలో తుంబాడ్ 35 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్ లో ఉంది. 2018లో విడుదలైన తుంబాడ్ మొదట్లో 15 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేసింది. కానీ రీ రిలీజ్ ద్వారా అది దూసుకెళ్లింది. మరో రీ రిలీజ్ విజయం లైలా మజ్ను సినిమాతో వచ్చింది.
2018లో దీని వసూళ్లు 2 కోట్లలోపే ఉన్నాయ్. కానీ, 2024లో ఈ సినిమాకు 14 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఇదే విధంగా రాక్ స్టార్ 6 కోట్ల రూపాయలతో,ఏ జవానీ హై దివానీ 3 కోట్ల రూపాయలతో, కల్ హో నా హో 5.8 కోట్ల రూపాయలతో వసూళ్లు సాధించాయి.ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. న్యూ వర్షన్స్ మరియు క్లాసిక్స్ ఆడుతూ, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తున్నాయి.