Abdul Rahim Rather appointed as Speaker of Jammu and Kashmir Assembly

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ నియామకం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమక్షంలో ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌.. అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ పేరును ప్రతిపాదించారు. కాగా, అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బుద్గాం జిల్లాలోని చరార్‌-ఇ-షరీఫ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేడు తొలిరోజు సభను ఉద్దేశించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగించనున్నారు.

కాగా, స్పీకర్‌ పదవికి పోటీ చేయకూడదని ప్రతిపక్షాలు నిర్ణయించడంతో మూజువాణి ఓటుతో అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌ ఎన్నికలు నిర్వహించారు. వ్యవసాయ మంత్రి జావేద్‌ అహ్మద్‌ దార్‌ స్పీకర్‌ పదవికి అబ్దుల్‌ రహీమ్‌ను ఎంపిక చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎన్‌సి ఎమ్మెల్యే రాంబన్‌ అర్జున్‌ ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఎన్నికల అనంతరం, శాసనసభ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్‌ శర్మలు అబ్దుల్‌ రహీమ్‌ వెంట వెళ్లగా ఆయన స్పీకర్‌ కుర్చీని అధిరోహించారు. నేటి నుండి ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అబ్దుల్‌ రహీమ్‌ గతంలో కూడా జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో స్పీకర్‌ పదవిని చేపట్టారు. పిడిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 2002-2008 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2018లో చివరిగా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆరేళ్లకు పైగా విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశమైంది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి.

Related Posts
హైదరాబాదీ టాలెంట్‌కు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా
sudhakar cars

ఆనంద్ మహీంద్రా హైదరాబాదీ టాలెంట్ గురించి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సుధాకర్ అనే వ్యక్తి వివిధ ఆకారాలలో కార్లను తయారు చేయడం మరియు ఒక మ్యూజియం Read more

రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

ఏపీకి తప్పిన ముప్పు
ap rains

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. వాయుగుండం ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రజలు కొంత ఊరట పొందారు. అయితే, Read more

APSRTC ఉద్యోగులకు తీపికబురు
APSRTC ఉద్యోగులకు తీపికబురు

APSRTC ఉద్యోగులకు తీపికబురు.APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) బకాయిల్లో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *