sharmila

జమిలి సరికాదు: షర్మిల

జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. జమిలిపై లోక్ సభలో చర్చలు జరుగుతున్న సమయంలో షర్మిల దీనిపై విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి… బీజేపీ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.
పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పార్లమెంటులో పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం… బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని షర్మిల అన్నారు. అసెంబ్లీల గడువును లోక్ సభతో ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జమిలి బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల మోజార్టీ బీజేపీకి లేదనే విషయం లోక్ సభలో ఓటింగ్ తో తేలిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూలిపోతే… రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కూలిపోవాలని… ఇందులో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని చెప్పారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే జమిలి బిల్లును కాంగ్రెస్ సమర్థించదని స్పష్టం చేశారు.

Advertisements
Related Posts
Vallabhaneni Vamsi: వంశీ కేసులో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ – కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా రెండో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ Read more

Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

తిరుపతి ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు Read more

ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు
ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో Read more

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్
ys jagan

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం Read more

×