kanimozhi

జమిని బిల్లు రాజ్యాంగ విరుద్ధం : ఎంపీ కనిమొళి

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లు సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని అన్నారు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు. బీజేపీ తమ ఇష్టానుసారంగా పాలని చేస్తుందని, ప్రజల ఇష్టాలకు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్‌ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు.
రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం
కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి తాము ఈ బిల్లును అంగీకరించబోమని అన్నారు. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాంతోపాటే బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించి జేపీసీకి అప్పగించారు.

Related Posts
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ వద్దు: సంజయ్ సింగ్
sanjay singh

ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో Read more

వందేభారత్ ట్రైన్ కోచ్‌ల కుదింపు
వందేభారత్ ట్రైన్ కోచ్‌ల కుదింపు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ట్రైన్ విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 20 కోచ్‌లతో నడుస్తున్న ఈ ట్రైన్‌ను, ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో 8 Read more

Ilaiyaraaja- Modi : మోదీతో ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ భేటీ
Ilaiyaraaja Modi

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఇళయరాజా తన ట్విట్టర్ ఖాతాలో Read more

ట్రంప్ దూకుడుతో అయోమయంలో ఉద్యోగులు
25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

కరోనాతో కకలావికలం అయిన ఆర్థిక వ్యవస్థలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని త్రైమాసికాలుగా తేరుకుంటూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక వృద్ధి Read more