jagan gurla

గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి – జగన్

విజయనగరం జిల్లా గుర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైస్ జగన్ అన్నారు. గుర్ల‌లో సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేద‌ని, అక్టోబర్‌ 19వ తేదీన తాను ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేద‌ని జగన్ మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు? స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు.

Advertisements

ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి. మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి. నాడు మా హయాంలో గ్రామాలు చూస్తే.. ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. మన గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు కనిపించేవి. సచివాలయాల్లో పంచాయతీరాజ్‌ శాఖలో పని చేసే వాళ్లు కనిపించే వాళ్లు. అక్కడే విద్యా శాఖ చూసే వాళ్లు కూడా కనిపించేవారు. ఈరోజు గుర్ల మండలం, గ్రామంలో జరిగింది ప్రజలంతా గమనించమని కోరుతున్నాను. రాష్ట్రంలో పరిస్థితి గమనించమని కోరుతున్నాని జగన్ తెలిపారు.

Related Posts
చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం.
ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి,వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలోనే అటు దెందులూరు నియోజకవర్గం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత చింతమనేని,వైసీసీ Read more

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు
duvvada srinivas

వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు అవ్వడం , పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ Read more

విద్యాశాఖలో నా మొదటి నిర్ణయం: నారాలోకేశ్
nara lokesh

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా నారా లోకేశ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని Read more

రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటానికి 3వ స్థానం
AP Shakatam in Delhi Republ

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానాన్ని దక్కించుకుంది. రసాయనాల వాడకం లేకుండా, సంప్రదాయ ఏటికొప్పాక బొమ్మలతో ప్రత్యేకంగా Read more

×