हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

క్రిస్మస్ తాతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరో..

Divya Vani M
క్రిస్మస్ తాతగా మారిపోయిన టాలీవుడ్ క్రేజీ హీరో..

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన క్రేజీ హీరో ఒక్కసారిగా శాంతాక్లాజ్ వేషంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.క్రిస్మస్ పండగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు శాంతాక్లాజ్. పిల్లలు ముఖ్యంగా ఈ క్రిస్మస్ తాతను బాగా ఇష్టపడతారు.ఎందుకంటే, తమకు నచ్చిన బహుమతులు తీసుకొస్తాడని వారు నమ్ముతారు. ఈసారి క్రిస్మస్ పండగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, టాలీవుడ్‌కు చెందిన యూత్ స్టార్ నితిన్ ఈ క్రిస్మస్ తాతగా మారి పిల్లలకు బహుమతులు పంచాడు.ఈ క్రిస్మస్‌కు నితిన్ నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. షూటింగ్ పూర్తయినప్పటికీ, అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే, అభిమానులను నిరాశపర్చకుండా, చిత్ర బృందం క్రిస్మస్ కానుకగా నితిన్ శాంతాక్లాజ్ లుక్‌లో ఉన్న ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో నితిన్ క్రిస్మస్ తాత గెటప్పులో,పిల్లలకు బహుమతులు పంచుతూ కనిపిస్తున్నాడు.ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కాదు,సినీ ప్రేక్షకులు కూడా నితిన్ క్రిస్మస్ లుక్‌ను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు.రాబిన్ హుడ్ చిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నో పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. రాబిన్ హుడ్ చిత్రం 2025 ఫిబ్రవరిలో విడుదల కానుందని సమాచారం.అయితే, దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఈ స్పెషల్ పోస్టర్ అభిమానుల్లో సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. నితిన్ శాంతాక్లాజ్ అవతారంతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చి, క్రిస్మస్ ఆనందాన్ని కొట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870