KTR Congress

కేటీఆర్‌ఫై విచారణకు గవర్నర్ ఆమోదం

తెలంగాణలో చలికాలంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఇక్కడి రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వ‌ర్మ ఆమోదం తెలిపారు. దీంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ).
భారీ నిధుల అవినీతి
బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్ వేదిక‌గా గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో ఫార్ములా ఈ-కారు రేస్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఫార్ములా ఈ-కారు రేసు నిధుల కేటాయింపుల‌లో భారీ అవినీతి జ‌రిగిన‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ కేసులో ఇప్ప‌టికే ఉన్న‌ ఇద్ద‌రు పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో పాటు అప్ప‌ట్లో రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఏసీబీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం ఇద్ద‌రు అధికారుల‌పై విచార‌ణ‌కు అనుమ‌తించింది. అలాగే ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు కోసం అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది. దీనిపై న్యాయ స‌ల‌హా మేర‌కు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ కేటీఆర్‌ను విచారించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు.
తమపై రాజకీయ కక్ష చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. నేరుగా తమను ఎదుర్కొనలేక తప్పుడు కేసులతో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బందికి గురిచేస్తునట్లు బీఆర్ఎస్ చెపుతున్నది.

Related Posts
ఎమ్మెల్సీ కవిత మామఫై కేసు నమోదు
police van

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీని ప్రారంభించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank launched IDFC First Academy

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి వేసిన ముందడుగు.. హైదరాబాద్ : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సమగ్ర ఆర్థిక అక్షరాస్యతకార్యక్రమం అయిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీనిప్రారంభించినట్లు Read more

కాంగ్రెస్ పాలనలోని తెలంగాణ పరిస్థితి ఇదే – కేటీఆర్
ktr tweet

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ "Kakistocracy" అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదానికి అర్థం పనికిరాని, తక్కువ Read more

ముంబైలో 25 ఏళ్ల పైలట్ ఆత్మహత్య: బాయ్‌ఫ్రెండ్‌ పై కేసు నమోదు
suicide

ముంబైలోని మారోల్ ప్రాంతంలో 25 ఏళ్ల సృష్టి తులి అనే ఎయిర్ ఇండియా పైలట్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించారు.ఆమె శరీరాన్ని సోమవారం ఆమె అద్దె Read more