liquid thrown on arvind kej

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆప్ సీరియస్‌గా స్పందిస్తూ, ఇది సామాన్య దాడి కాదని, పధకం తోనే ఆసిడ్ దాడి అని ఆరోపించింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న కార్యకర్తలు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

అత‌డి వ‌ద్ద ఉన్న‌ బాటిల్‌ను పరిశీలించగా అందులో స్పిరిట్ ఉన్నట్లు తేలిందని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.

Related Posts
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్
భారీగా ఉద్యోగులను తొలగించిన ఓలా ఎలక్ట్రిక్

గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత భవిష్ అగర్వాల్ కలల ప్రాజెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న హీట్ Read more

సీఎం రేవంత్ కు రాహుల్ ఫోన్
rahul phone

తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం Read more

కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
mahesh kumar

యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను Read more

భారత్ ఎక్కడ ఆడినా గెలుస్తుంది: వసీం అక్రమ్
భారత్ ఎక్కడైనా గెలుస్తుంది ! వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో ఆడి గెలవడం క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశమైంది. భారతదేశం పాకిస్తాన్‌లో ఆడకపోవడం కొందరికి లాభదాయకంగా అనిపించగా, మరికొందరు ఇది Read more