lokesh delhi

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రికి లోకేష్ విన్నపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం విద్యా రంగంలో ముఖ్యమైన పరిణామం. న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలసిన ఆయన, రాష్ట్రంలోని పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో తరగతి గదుల మరమ్మతులు, టాయ్‌లెట్లు, తాగునీటి వసతులకు రూ.4,141 కోట్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2,621 కోట్లు అవసరమని వివరించారు.

Advertisements

అలాగే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 విజయవంతంగా అమలు చేస్తున్న ఏపీకి PM శ్రీ పథకం 3వ విడతలో 1,514 పాఠశాలలు మంజూరు చేయాల్సిందిగా కోరారు. 2,369 పాఠశాలలకు ప్రతిపాదనలు పంపినా, మొదటి రెండు విడతల్లో 855 పాఠశాలలు మాత్రమే మంజూరయ్యాయని గుర్తుచేశారు. ఈ మేరకు కొత్త స్కూళ్ల మంజూరుకు సహకరించాలన్న ఆయన విజ్ఞప్తికి, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

మరియు, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

Related Posts
Trump Tariffs: అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్
అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్

అమెరికా అనేక దేశాలపై విధించిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోపక్క చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. అమెరికా Read more

ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని క్యాప్చర్ చేయండి.. ఒప్పో
OPPO Reno13 series launched in India with new MediaTek Dimensity 8350 chipset and AI ready cameras

OPPO Reno13 సిరీస్ GenAIని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది భారతదేశ మార్కెట్లో AI-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త కొలమానాలను నిర్దేశిస్తుంది. IP66 / Read more

Karnataka : కర్ణాటక అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
18 MLAs suspended in Karnataka Assembly

Karnataka : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పదవిని అగౌరవపరిచినందుకు క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ Read more

Piyush Goyal : చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
Piyush Goyal key comments on China trade policy

Piyush Goyal : కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరుగుతుండటంపై గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన Read more

×