varra ravindar

కీలక నిజాలు బయటపెట్టిన వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి

గత వైసీపీ హయాంలో సోషల్ మీడియా లో అసత్యప్రచారాలు , అసభ్యకర పోస్టులు , వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా లో ఇదే విధంగా అధికార పార్టీల నేతలపై పోస్టులు పెడుతుండడం , మహిళలను కిచ్చపరిచే విధంగా వ్యవహరిస్తుండడం తో కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడం తో వైసీపీ సోషల్ మీడియా టీం ను అదుపులోకి తీసుకుంటున్నారు.

Advertisements

తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. . ఈ నేప‌థ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఐప్యాక్ టీమ్‌ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమ‌ని తెలిపారు.

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమ‌ని అన్నారు. వైసీపీ సోష‌ల్‌మీడియా బాధ్య‌త‌లు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న త‌ర‌వాత‌ మరింత రెచ్చిపోయామ‌ని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి త‌న ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామ‌ని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి త‌మకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.

Related Posts
Donald Trump: ఐఫోన్లపై ట్రంప్‌ కీలక నిర్ణయం !
Donald Trump:డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూశారా

ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్ .డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. స్మార్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, Read more

ChandrababuNaidu: P-4 చైర్మన్‌గా చంద్రబాబు వైస్‌ చైర్మన్‌గా పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా, ఇప్పుడు పలు కీలక ప్రాజెక్టులకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి పనులను వేగవంతం Read more

నా వెనుకాల నిలబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి – హరీష్ రావు కామెంట్స్
cm revanth harish

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. Read more

తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ముందంజలో బీజేపీ
Counting of MLC votes in Telangana.. BJP in the lead

హైదరాబాద్‌: కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి Read more

×