shivalayalu

కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు శివుడు మరియు పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగిస్తూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజును శివభక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. వరంగల్ వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించి స్వామి దర్శనం చేసుకుంటున్నారు.ఆ అలాగే కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్‌ భూపాలపల్లిలోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, కొడవటూరు సిద్దులగుట్ట, ములుగు జిల్లా వెంకటాపురంలోని రామప్ప తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.

Related Posts
Durga Idol: హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
735204 amma

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది, దీనివల్ల హిందూ సమాజంలో తీవ్ర కలకలం రేగింది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని Read more

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Srivari Arjitha Seva tickets will be released tomorrow

తిరుమల: రేపు (బుధవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, Read more

మహా కుంభమేళా సందడి మొదలు..
మహా కుంభమేళా సందడి మొదలు..

మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుతమైన మతపరమైన సమావేశం. ఈ అద్భుతమైన వేడుక ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. జనవరి 13న ప్రారంభమయ్యే Read more

శ్రీ మందిర్ యొక్క కార్తీక మహా దీపం వేడుక
Kartika Maha Deepam celebration of Sri Mandir

ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు విముక్తి కోసం అరుణాచలేశ్వర దీపం యొక్క ప్రత్యక్ష దర్శనంతో పవిత్రమైన అరుణాచల తీర్థ శివ పార్వతీ కళ్యాణం మరియు మహా రుద్ర హోమంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *