pawan kalyan visits kakinad

కాకినాడ పోర్టు అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి పవన్ లేఖ

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ‘ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు’ అని పవన్ ట్వీట్ చేశారు.

కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని… అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని, అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేసారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి..? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా..? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు.మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్‌) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం వచ్చింది.

వెంటనే ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్‌ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం అని గుర్తించారు.

Related Posts
కొత్త ఉద్యోగం కోసం నిపుణుల వెతుకులాట..!
Looking for professionals for a new job.

న్యూఢిల్లీ : భారతదేశంలోని 55% మంది నిపుణులు ఉద్యోగ శోధన పట్ల నిరాశ చెందుతున్నారు, ఎందుకంటే గత సంవత్సర కాలంలో ఈ ప్రక్రియ కష్టతరంగా మారిందని వారు Read more

సినీ ఇండస్ట్రీలో విషాదం, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..
సినీ ఇండస్ట్రీలో విషాదం, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..

టాలీవుడ్‌లో ఒక పెద్ద షాకింగ్ సంఘటన జరిగింది. "కబాలి" చిత్ర నిర్మాత కెపి చౌదరి (కృష్ణ ప్రసాద్ చౌదరి) 100 గ్రాముల కొకైన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో Read more

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా
ap mega dsc

ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా Read more

రేపు జగన్ ప్రెస్ మీట్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *