kamareddy congres

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ పదవులు ఇవ్వడం పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుక్కారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో సీనియర్‌ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేద‌నను పార్టీ పెద్దలు గుర్తించకపోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ప్రతిపాదించిన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Related Posts
మౌలిక వసతుల కోసం మెడికోస్ ధర్నా
medical college F

ఆసిఫాబాద్ కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, మౌలిక వసతుల కోసం మెడికోస్ ధర్నా నిర్వహిస్తూ ఆసిఫాబాద్‌లోని మెడికల్ కళాశాలలో కనీస Read more

మావోయిస్టుల బంద్‌తో ములుగులో హై అలర్ట్
mulugu maoist bandh

మావోయిస్టులు సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల ఉద్యమం ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి Read more

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ktr revanth

ప్ర‌భుత్వ‌, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకటో తేదీన Read more

రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
Good news for retired emplo

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు తపాలా శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడం లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు ఇండియా పోస్ట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *