votar card

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు: ఈసీ

ఇటీవల జరిగిన ఎన్నికలపై పలు అనుమానాలకు తావు వున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి 1 తో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisements

యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.


సవరించిన ఓటర్ల జాబితా
ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డులు కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.

Related Posts
Air India : ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన…
Air India ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది.బిజినెస్ క్లాస్‌లో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో అదుపు కోల్పోయాడు.తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన Read more

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై కేసు నమోదు!
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై కేసు నమోదు!

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆయనపై, ప్రజా ధనాన్ని దుర్వినియోగం Read more

MK Stalin : మోదీ పర్యటనకు డుమ్మా కొట్టిన సీఎం స్టాలిన్
MK Stalin మోదీ పర్యటనకు డుమ్మా కొట్టిన సీఎం స్టాలిన్

తమిళనాడులోని పాంబన్ వద్ద నిర్మించిన కొత్త వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది దేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్. అయితే ఈ Read more

BJP MLA: బహిష్కరణకు గురైన బీజేపీ ఎమ్మెల్యే సొంతగా పార్టీ
BJP MLA: బహిష్కరణకు గురైన బీజేపీ ఎమ్మెల్యే సొంతగా పార్టీ

బీజేపీ బహిష్కరణ తర్వాత యత్నాల్ కొత్త రాజ‌కీయ అడుగు కర్ణాటకలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ Read more

×