ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలో, ధోనీ జట్టుతోనే కనిపిస్తూ, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, ఐపీఎల్‌లో తన మాయ కొనసాగిస్తున్నాడు. 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన తర్వాత కూడా అతను 2025లో ఆడతాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా ఫొటోలో ధోనీ పసుపు ప్యాడ్లు, చెన్నై జెర్సీ ధరించి ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు “ఐపీఎల్ కోసం వెయింటింగ్!”అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన ధోనీ తన కెరీర్‌ను సూపర్ విజయాలతో మలిచాడు.CSKకి 5 సార్లు ట్రోఫీ గెలిపించిన ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ ఖాతాలో వేసాడు.ధోనీ ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, 229 ఇన్నింగ్స్‌లలో 5243 పరుగులు చేశాడు.ఈ జాబితాలో 24 అర్ధశతకాలూ ఉన్నాయి. కెప్టెన్‌గా తన అద్భుతమైన వ్యూహాలతో చరిత్ర సృష్టించిన ధోనీ, ఐపీఎల్‌లో సత్తాచాటడం ఇంకా కొనసాగిస్తుండటం అందరికీ సంతోషకర విషయం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ 2025 మార్చి 21న ప్రారంభం కానుంది.ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. 10 జట్లు ఈ సీజన్ టైటిల్ కోసం పోటీపడతాయి. అభిమానులు ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుస్తాడని ఆశిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా రిటైర్మెంట్ మాట కూడా ప్రస్తావించని ధోనీ, ప్రాక్టీస్‌తో సన్నద్ధమవుతూ మరోసారి క్రికెట్ మైదానంలో హవా చూపించబోతున్నాడు. CSK అభిమానులు “తలా”ను మళ్లీ మైదానంలో చూసేందుకు ఆతృతగా ఉన్నారు

Related Posts
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుండి 26వ తేదీ వరకు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు Read more

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
vaa

అమరావతి : ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్‌
surekha hot comments

మంత్రి కొండా సురేఖ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలిచారు. ఈసారి బీఆర్ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల వ్యవహారశైలి పట్ల తీవ్ర విమర్శలు చేశారు. Read more

కేసీఆర్ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పాలాభిషేకం
ktr kcr

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *