Aikhya Infra Developers Inaugurate E5World

ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ‘ఈ5వరల్డ్’ కు అంకురార్పణ

ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో..ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పూర్తి..

హైదరాబాద్: ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్‌ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ‘ఈ5వరల్డ్’ కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్‌ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌ మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.

ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్లు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్, ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ‌ ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్‌ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది‌ పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి, న్యాయవాది, బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్, ఈ5వరల్డ్ సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించి..

ఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్‌ స్టైల్ కు మద్దతు ఇస్తుంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్‌హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.

Related Posts
బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల పై విచారణ
Inquiry on petitions of Telangana and AP IAS in CAT today

హైదరాబాద్‌: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని Read more

పోచారం శ్రీనివాసరెడ్డి పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
jeevan reddy pocharam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని.. Read more

మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్ న్యూస్
Good news for Mid Maneru re

మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్ తెలిపింది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు… నేటి కలియుగంలో జననివాసాలు మిడ్ మానేరులో మునిగిపోయాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *