AP High Court swearing in three additional judges

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

అమరావతి : ఏపీలో ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిర్వహించారు. సోమవారం హైకోర్టు తొలి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (కుంచం), తూటా చంద్ర ధన శేఖర్ (టిసిడి శేఖర్), చల్లా గుణరంజన్ మూడువురు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.

Advertisements

కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైకోర్టులో అత్యంత సాధారణంగా జరిగింది, ఈ వేడుకలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, పలువురు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు న్యాయమూర్తులు సాధారణంగా న్యాయమూర్తులుగా లేదా సాధారణంగా ‘శాశ్వత’ న్యాయమూర్తులుగా పిలువబడే ముందు రెండు సంవత్సరాల వ్యవధిలో నియమిస్తారు. మంత్రిత్వ శాఖ ప్రకారం, కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను శాశ్వత న్యాయమూర్తిగా నియమించగా, న్యాయవాదులు మహేశ్వరరావు కుంచెం, టిసిడి శేఖర్ మరియు చల్లా గుణరంజన్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.

Related Posts
తీరం దాటిన పెంగల్
rain ap

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని Read more

తిరుమల కాటేజీల పేర్లు మార్పు
tirumala eo

టీటీడీ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టనున్నామని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు. కాటేజీ దాతలు ఎంపిక Read more

ఇంటర్ విద్యార్థిని పై ప్రేమోన్మాది ఘాతుకం
A lover who killed an inter

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17) పై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ Read more

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాజకీయాల్లో వేడి – సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ భేటీ ముఖ్యాంశాలు

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Read more

×