AP High Court appoints three new judges copy

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..

అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.

Advertisements

వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.

Related Posts
ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు – ఈటల
Government should support Telangana farmers.. Etela Rajender

ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే , ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ Read more

కిక్కిరిసిపోయిందని మాట్లాడలేకపోయా: జగన్
కిక్కిరిసిపోయిందని మాట్లాడలేకపోయా: జగన్

మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో Read more

ప్రారంభమైన ఏఐసీసీ నూతన కార్యాలయం
Inauguration of AICC new office, Indira Gandhi Bhavan, in Delhi

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన భవనానికి ఇందిరాగాంధీ అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ Read more

స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి
swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా Read more

×