volunteers

ఏపీ వాలంటీర్ల కీలక నిర్ణయం

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇప్పటివరకూ తమకు పెండింగ్ ఉన్న జీతాల్ని చెల్లించలేదని, సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్తారని ఇప్పటివరకూ ఎదురుచూశామని వాలంటీర్లు తెలిపారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతాలు రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన అధికార పార్టీలు.. ప్రభుత్వం వచ్చాక మాత్రం వారిని వదిలేశాయి. దీంతో అప్పటి నుంచీ నిరసనలు చేస్తున్న వాలంటీర్లు తాజాగా మరో వ్యూహం ఎంచుకున్నారు. దీనిపై నిన్న విజయవాడలో ప్రకటన చేశారు.

Advertisements

వాలంటీర్ల కొనసాగింపుకు అసలు ఈ వ్యవస్థను నియమిస్తున్నట్లు గత ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మరి కొనసాగిస్తామని ఎలా హామీ ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీతాలు పెంచుతామని ఎలా చెప్పారని అడుగుతున్నారు. సంక్రాంతి సందర్భంగా అందరి బకాయిలు తీర్చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ జీతాల బకాయిలు ఎప్పుడు తీరుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇవే అంశాలతో ఓ వినతిపత్రం తీసుకుని రేపు అమరావతిలో జరిగే ఏపీ కేబినెట్ భేటీకి వెళ్తామని, అక్కడ సీఎం చంద్రబాబుకు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలంటూ ఓ వినతిపత్రం సమర్పిస్తామని వాలంటీర్లు వెల్లడించారు.

Related Posts
ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం: సీఎం చంద్రబాబు
Future There Will Be Only One Thing That Is Tourism. CM Chandrababu

విజయవాడ: విజయవాడ - శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. Read more

AndhraPradesh :93వేల మంది వితంతువులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
AndhraPradesh :93వేల మంది వితంతువులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుతో వేలాది మంది అర్హులు కొత్తగా పింఛన్ల మంజూరుపై ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అందుతున్న Read more

ముగిసిన వంశీ మూడు రోజుల కస్టడీ విచారణ
vallabhaneni vamsi three day custody has ended

కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు Read more

యోగి సర్కారు పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
pawan yogi govt

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కుంభమేళా నిర్వహణపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన పవన్, Read more

×