pention

ఏపీలో భరోసా పింఛన్ల పంపిణీ

ఏపీలో కూటమి ప్రభుత్యం వచ్చాక, ఎన్నికల హామీలో భాగంగా పేదలకు భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది స‌ర్కార్‌. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ చేశారు.

Advertisements


ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూట‌మి ప్ర‌భుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్ర‌భుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువచ్చింది.

Related Posts
Chandrababu :అమరావతి రాష్ట్ర పటానికి రంగులు:చంద్రబాబు
Chandrababu అమరావతి రాష్ట్ర పటానికి రంగులు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.ఈ వీడియోలో ఆయన స్వయంగా బ్రష్ పట్టుకుని, అమరావతి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన Read more

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
CM Chandrababu brother Ramamurthy Naidu passed away

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో Read more

హైదరాబాద్‌లో ‘లవర్స్ డే’ బ్యాన్ డిమాండ్ – బజరంగ్ దళ్ ప్రకటన!
హైదరాబాద్‌లో 'లవర్స్ డే' బ్యాన్ డిమాండ్ – బజరంగ్ దళ్ ప్రకటన!

హైదరాబాద్‌లో వాలెంటైన్స్ డే నిరసన హైదరాబాద్‌లో వాలెంటైన్స్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ కీలక ప్రకటన చేసింది. ప్రేమికుల రోజు పేరుతో జరిగే Read more

గ్రూప్‌-2 ప‌రీక్ష‌లపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ
గ్రూప్‌-2 ప‌రీక్ష‌లపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ

ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌పై ఏపీ ప‌బ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు (ఆదివారం) జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తామని స్పష్టం Read more

×