daikin

ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీ భాగస్వామ్యంతో శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది.
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్
దాదాపు 75 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్ గా అవతరిస్తుందని పేర్కొంది. ఇన్వర్టర్, నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను ఇక్కడ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.
రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోయే యూనిట్ తో కలిపి భారత్ లో మొత్తం మూడు యూనిట్లు నెలకొల్పినట్లు అవుతుందని డైకిన్ కంపెనీ వివరించింది. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లతో కలిపి ఏటా 2 మిలియన్ కంప్రెసర్లను తయారుచేస్తున్నామని, 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని, భారత మార్కెట్లో ఏసీ విక్రయాల్లో టాపర్ గా నిలవాలన్నదే తమ లక్ష్యమని డైకిన్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనితో యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.

Advertisements
Related Posts
త్వరలో ఏపీలో వాట్సప్ గవర్నెన్స్‌
whatsapp

రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్‌ దిశగా తొలి అడుగు పడబోతోంది. వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక ఉండబోదు. అందుబాటులో Read more

అమిత్ షా స్వాగతం పలికిన చంద్రబాబు పవన్ కల్యాణ్
xr:d:DAF 48Mc8Tk:2,j:8275785304220518961,t:24030803

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఆయనను స్వాగతించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ Read more

ముగిసిన వంశీ మూడు రోజుల కస్టడీ విచారణ
vallabhaneni vamsi three day custody has ended

కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు Read more

YS Sharmila : పులి బిడ్డ పులిబిడ్డే.. వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్
A tiger cub is a tiger cub.. YS Sharmila sensational tweet

YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా Read more

×