rain

ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో జనజీవనం అస్తవ్యస్తమైనది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్లు ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారం తెలియజేశారు. దీని ప్రభావం వలన మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. కళింగపట్నం విశాఖపట్నం పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

Advertisements

విశాఖ జిల్లాలో 387. 6 మిల్లీమీటర్ల వర్షం పాతం

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలకు ఇళ్లు, చెట్లు నేలకూలుతున్నాయి. 24 గంటల్లో విశాఖ జిల్లాలో 387. 6 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదయింది.
విశాఖ జిల్లాలోని అనంతపురంలో 47. 8 మిల్లీమీటర్లు, పెదగంట్యాడలో 42. 6, ములగాడలో 39. 4, భీమిలిలో 39. 2, గాజువాకలో 36. 4, పద్మనాభంలో 35. 6, మహారాణి పేటలో 35. 2, విశాఖ గ్రామీణ ప్రాంతంలో 32. 6, పెందుర్తి 27. 8, గోపాలపట్నంలో 26. 8, సీతమ్మదారుల 24.2 మీటర్ల వర్షపాతం నమోదయింది.
ఇదిలా ఉండగా అల్పపీడన ప్రభావం వలన విశాఖలోని సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. పెద్ద ఎత్తున కెరటాలు ఒడ్డుకు చేరడంతో శుక్రవారం గోకుల్ పార్కు వద్ద ఉన్న బీచ్ రక్షణ గోడ చాలా వరకు దెబ్బతింది.

Related Posts
వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!
వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!

ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా 88 మందికి భారీ Read more

గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు ప్లాన్..!
Plan for open meetings of Congress and BRS competition in Gajwel

హైదరాబాద్‌: గజ్వేల్‌లో పోటాపోటీ బహిరంగసభలకు రేవంత్, కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ పెట్టుకుందాం అని కేసీఆర్ ఇటీవల తన ను కలిసిన Read more

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది – భట్టి విక్రమార్క
bhatti budjet

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని Read more

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం – సీఎం రేవంత్
dec 09 telugu talli

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గురువారం విజయోత్సవాలఫై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి Read more

×