Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒక ముఖ్యమైన భాగం.

Advertisements

కాగా, శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.

ఇకపోతే.. ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అర్హులైన ప్రజలకు ఉచిత గ్యాస్ అందించబడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం-2 పథకానికి అనుగుణంగా ఉచిత సిలిండర్లు అందించబడనున్నాయి. ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారాన్ని తగ్గించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత సిలిండర్లను నాలుగు నెలల వ్యవధిలో ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నది.

Related Posts
ఢిల్లీలో భూకంపం
delhi earthquake feb17

ఉదయం స్వల్ప భూకంపం ఢిల్లీలో భూకంపం.దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదైనట్లు భూకంప పరిశీలన కేంద్రాలు Read more

హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 114 సెక్షన్‌ అమలు: సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు
Implementation of Section 114 in Hyderabad for a month. CP CV Anand orders

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో నిన్నటి నుండి (ఈనెల 27)న సాయంత్రం 6 గంటల నుండి వచ్చే నెల 28 వరకు ఆంక్షలు Read more

Kamareddy: పండుగ రోజు విషాదం.. చెరువులో పడి ఒకే ఇంట్లో నలుగురు మృతి
Kamareddy: పండుగ రోజు విషాదం.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఉగాది పండుగ రోజు ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా Read more

గిరిజన బిడ్డను రాజకుటుంబం అవమానించింది: ప్రధాని
Tribal child insulted by royal family.. PM Modi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. 'గిరిజన ఆడబిడ్డ'ను 'రాజకుటుంబం' అవమానించిందని తప్పుపట్టారు. ఢిల్లీలోని Read more

×