rajiv rajan mishra

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీంతో రాజీవ్ రంజన్ మిశ్రా నేడు గుంటూరు కలెక్టరేట్ లో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రాలు అందించారు.

Advertisements
rajiv ranjan2


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. త్వరితగతిన వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆయా కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా మేలు చేసేందుకు చంద్రబాబు ముందుకొచ్చారని తెలిపారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ… మాదిగలు రిజర్వేషన్ ఫలాలను తక్కువగా పొందుతున్నారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడమే న్యాయబద్ధం అని స్పష్టం చేశారు. దీనిపై మాలలు, మాదిగలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు.

Related Posts
పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ
పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి అనిత భేటీ

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను Read more

ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో Read more

విడదల రజనికి స్వల్ప ఊరట
HC provides relief to ex minister Vidadala Rajani in SC, ST Atrocity Case

అమరావతి: విడదల రజని ఆదేశాల మేరకే ఇబ్బంది పెట్టారంటూ కోటి పిటిషన్.మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముందస్తు Read more

AndhraPradesh: కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల సమావేశం ఈ రోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.అధికారులు ప్రజలకు Read more

×