ఉచిత బస్సు ప‌థ‌కంలో కీల‌క నిర్ణ‌యం!

ఉచిత బస్సు ప‌థ‌కంలో కీల‌క నిర్ణ‌యం!

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా అని మ‌హిళ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
ఈ ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల ప‌రిశీల‌న‌కై ప్ర‌భుత్వం కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రుల‌తో ఈ స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ర‌వాణా, మ‌హిళా-శిశు సంక్షేమ, హోం శాఖల మంత్రులు ఇందులో స‌భ్యులుగా ఉంటార‌ని తెలిపింది.
ఇత‌ర రాష్ట్రాల్లో ఈ ప‌థ‌కం ఎలా అమ‌లు అవుతోంది, అక్క‌డి విధివిధానాలు, ఏపీలో ఎలా అమ‌లు చేస్తే బాగుంటుంది త‌దిత‌ర విష‌యాల‌పై మంత్రుల క‌మిటీ వీలైనంత త్వ‌ర‌గా నివేదిక‌ను, సూచ‌న‌ల‌ను ఇవ్వాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌డం జ‌రిగింది. స‌బ్ క‌మిటీ నివేదిక ఆధారంగా ఏపీలో ఈ ప‌థ‌కం అమ‌లు కానుంది.
తెలంగాణలో ఉచిత బస్సు ద్వారా మహిళలు లబ్ది పొందుతున్నారు. ఈ విధానం ఆంధ్రాలో కూడా అమలు చేయాలనీ కూటమి కృషి చేస్తున్నది.

Advertisements
Related Posts
10th Exams : పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్ – హోంమంత్రి అనిత
SSC Public Exams 2025: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి.. విద్యార్థులకు ఇవే ముఖ్య సూచనలు

ఏపీ హోంమంత్రి అనిత పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షలు జీవితంలో కీలకమైనవే కానీ, అవే జీవితం కాదని ఆమె అన్నారు. విద్యార్థులు టెన్షన్ Read more

Gannavaram Court: ఏప్రిల్‌ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్‌
Vallabhaneni Vamsi remanded until April 1

Gannavaram Court: గన్నవరం కోర్టులో వైసీపీనేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేసి హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్‌ 1 వరకు వంశీకి రిమాండ్‌ Read more

12 ఎకరాల స్థలం కొన్న పవన్ కళ్యాణ్..ఎక్కడంటే..!!
ఎన్నికల హామీల అమలుపై ఏపీ సర్కారు ఫోకస్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రాజకీయ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి మరో 12 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. పవన్ Read more

సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు
సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు

సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ Read more

×