CM Chandrababu launched the free gas cylinder scheme

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారులలో ఒకటైన శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. అనంతరం జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisements

జానకమ్మ సీఎం చంద్రబాబుకు తన సొంత ఇల్లు కట్టించమని కోరారు. ఇందుకు సీఎం హామీ ఇచ్చి.. రేపటి నుంచే మీ ఇంటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చారు. డ్వాక్రా కార్యక్రమంలో లీడర్‌గా ఉన్నావు కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలి అని సీఎం జానకమ్మకు సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వారికి జనరిక్ మందులు అందుబాటులో ఉంటే చూడాలని కలెక్టర్‌ను సూచించారు. జానకమ్మ మాట్లాడుతూ.. “నేను రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు” అని సీఎం చంద్రబాబుకు తెలిపారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని ఆమె చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ద్రబాబు ఆమెను ఓదార్చారు.

Related Posts
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
South Central Railway has announced 26 special trains for Sankranti

కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ అదనంగా మరికొన్ని ప్రత్యేక రైలు Read more

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూత
RajendraPrasad Gayatri

హైదరాబాద్‌: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. Read more

చైనా “ప్రేమ విద్య” ద్వారా యువతలో మంచి దృక్పథాలను పెంచాలనుకుంటున్నదా?
China Medical University

చైనా వివాహం, ప్రేమ, సంతానం మరియు కుటుంబం పై సానుకూల దృక్పథాలను పెంచేందుకు "ప్రేమ విద్య"ను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ఈ చర్య దేశంలోని జనాభా పెరుగుదలని Read more

Modi: తెలుగులో మాట్లాడమన్న మోదీ ఎందుకంటే?
Modi: తెలుగులో మాట్లాడమన్న మోదీ ఎందుకంటే?

ముద్రా యోజనతో జీవితమే మారింది – ఏపీ మహిళ ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా అనేకమంది లబ్దిదారులు ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని Read more

×