5d039be7 9854 45f0 9161 681422016864

ఇండియాకు ట్రంప్‌ వార్నింగ్

జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్న అమెరికా కాబోయి అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను హెచ్చరించారు. ఎన్నికలో గెలిచిన ట్రంప్‌.. ప‌న్నుల అంశంలో భార‌త విధానాన్ని త‌ప్పుప‌ట్టారు. అమెరికా ఉత్ప‌త్తులపై భారీగా దిగుమ‌తి సుంకాన్ని భార‌త్ వ‌సూల్ చేస్తున్న‌ద‌ని, దానికి ప్ర‌తీకారంగా మేం కూడా ట్యాక్స్‌ను వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఒక‌వేళ భార‌త్ ప‌న్ను వ‌సూల్ చేస్తే, వాళ్ల‌కు కూడా మేం ట్యాక్స్ వేస్తామ‌ని, ఇది ప్ర‌తిచ‌ర్య‌గా ఉంటుంద‌ని, దాదాపు అన్ని అంశాల్లో భార‌త్ అధిక దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ద‌ని, కానీ తామేమీ ట్యాక్స్ వ‌సూల్ చేయ‌డం లేద‌ని ట్రంప్ తెలిపారు. చైనాతో జ‌రిగిన వాణిజ్య ఒప్పందంపై ప్ర‌శ్న వేసిన స‌మ‌యంలో.. ట్రంప్ ఈ స‌మాధానం ఇచ్చారు.
ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా త‌మ ఉత్ప‌త్తుల‌పై అధిక దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. రెండు దేశాలమధ్య స్నేహ సంబంధానికి తాము కట్టుబడి ఉన్నట్లు ట్రంప్ అన్నారు. అయితే పన్నుల విషయంలో భారత్ వైఖరి మారాలని ఆయన పేర్కొన్నారు.

Related Posts
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
telangana rain

తెలంగాణలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల Read more

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy challenged KCR

సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ Read more

జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్రం విఫలం – రాహుల్
Rahul Gandhi will visit Jharkhand today

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ వద్ద సైనిక వాహనంపై ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించిన విషయం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ దాడిపై కాంగ్రెస్ ఎంపీ Read more

‘జై జనసేన’ నినాదంతో చిరంజీవి!
‘జై జనసేన’ నినాదంతో చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావించిన ‘జై జనసేన’ నినాదం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత, ప్రజారాజ్యం పార్టీ గురించి ఆయన బహిరంగంగా మాట్లాడటమే కాకుండా, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *