chandra babu

ఆ అధికారులను సస్పెండ్ చేయండి: చంద్రబాబు

తిరుపతి తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారుల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద పార్క్ లో వేచి ఉన్న భక్తుల్లో ఒక మహిళ స్పృహతప్పి పడిపోయిందని… దీంతో, ఆమెను కాపాడేందుకు అక్కడ ఉన్న డీఎస్పీ గేటు తీశారని నివేదికలో పోలీసులు తెలిపారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.

Advertisements

కేసులు నమోదు చేయండి

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫిక్స్ చేయాలని, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.
ఏవి ముందస్తు చర్యలు?
వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో… భక్తులు ఎక్కువగా వస్తున్నారని స్థానిక జర్నలిస్టులు చెప్పినప్పటికీ… అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా… సరైన ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సాయంత్రంలోగా కొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.

Related Posts
ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ:హాజరైన చంద్రబాబు
ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ హాజరైన చంద్రబాబు

ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ:హాజరైన చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేది ఒక అద్భుతమైన పేరు. జీవితంలో అనేక రంగాలలో మెప్పు పొందిన ఆయన, ఇప్పుడు తన రచనతో కూడా Read more

మిర్చి మార్కెట్ లో కల్లోలం ఏపీలో ప్రస్తుతంధరలు ఎలా ఉన్నాయి.
మిర్చి మార్కెట్ లో కల్లోలం ఏపీలో ప్రస్తుతంధరలుఎలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ధర పతనం పొలిటికల్‌గా ఘాటెక్కిస్తోంది. అధికార, విపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు మిర్చి Read more

Nara Lokesh:టెన్త్, ఇంటర్‌ ఫలితాలు మొబైల్ లోనే చూసుకోవచ్చు :నారా లోకేశ్‌
Nara Lokesh:టెన్త్, ఇంటర్‌ ఫలితాలు మొబైల్ లోనే చూసుకోవచ్చు :నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0" వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానించనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో వెల్లడించారు. Read more

సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు..!
Changes in CM Chandrababu security.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో భారీ మార్పులు చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే Read more

×