man commits suicide by hang

ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన కడ్డీకి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు.

Related Posts
‘పుష్ప-2’ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలుసా..?
pushpa 2 trailer views

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే Read more

ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియామకం
praveen aditya appointed as

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఎండీ దినేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి Read more

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో బస్సు నది‌లో పడింది.
pok

పాకిస్థాన్-ఆధీన కశ్మీర్‌లో గిల్‌గిట్-బాల్టిస్టాన్ ప్రాంతంలో నవంబర్ 12న ఒక దుర్ఘటన జరిగింది. ఒక బస్సు, దాదాపు ఇరవై మంది వివాహ అతిథులను తీసుకుని, ఇండస్ నదిలో పడిపోయింది. Read more

అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్న పుష్ప 2
pushpa 2 tickets records

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పుష్ప-2' సినిమా టికెట్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత వేగంగా 10 Read more

×