accident

ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు ప్రమాదాలు.. 52 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై గత రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో ప్రమాదంలో మహిళలు, పిల్లలు
ఇదే హైవేపై మరో ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తంగా 52 మంది మృతి చెందారు. గాయపడిన 76 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగా అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగేలా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisements
Related Posts
సుసీ వైల్స్‌ వైట్ హౌస్‌లో కీలక పదవికి నియమం: ట్రంప్‌ బృందంలో కొత్త మార్పులు
susie

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికైన తరువాత తన బృందంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసి, ప్రైవేటు సలహాదారులను కీలక పదవులలో నియమించారు. ఈ మేరకు, ఆయన Read more

క్యూబా ఇక ఫ్రీ: బైడెన్ చారిత్రాత్మక నిర్ణయం
Biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జో బైడెన్.. చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. పొరుగుదేశం క్యూబపై ఉన్న ఉగ్రవాద దేశం ముద్రను తొలగించారు. అమెరికా రూపొందించుకున్న ఉగ్రవాద దేశాల Read more

పాకిస్తాన్‌లో పోలియో వ్యాప్తి: 2024లో 55 కేసులు, సవాలుగా మారిన పరిస్థితి..
pakistan polio cases

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సుల్లో మూడు కొత్త పొలియో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకు పొలియో బాధితుల సంఖ్య Read more

Myanmar: మయన్మార్‌కు భారత్‌ ఆపన్నహస్తం
మయన్మార్‌కు భారత్‌ ఆపన్నహస్తం

మయన్మార్ , థాయ్‌లాండ్‌ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో రెండు దేశాలు Read more

×