1200px High Court of Telangana in Hyderabad removebg previewwphwd1Vidzi

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు

అల్లు అర్జున్ కాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించిన అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామన్న లాయర్. పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు వివరించిన న్యాయవాది. బందోబస్తు కావాలని డిసెంబర్ రెండవ తేదీని లేఖ రాసినట్లు వివరించారు. ఈ మేరకు ఆ లేఖను న్యాయమూర్తికి అందించారు.

ప్రీమియర్ షో కి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెబుతున్న పోలీసులు. బెయిలు లేదా క్వాష్ పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ న్యాయవాది వాదన. పోలీసుల నుండి అక్నాలడ్జిమెంట్ కాపీని అడిగి తీసుకున్న న్యాయమూర్తి. అల్లు అర్జున్ పై ఉన్న అభియోగాలు ఏమిటో వివరంగా చెప్పాలని ప్రశ్నించిన కోర్టు. సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వచ్చేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది. ఆరోజు పోలీసులు ఇచ్చిన క్లారిటీ కాపీని కోర్టు ముందు ఉంచిన పోలీసులు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఏ 11గా అల్లు అర్జున్ ఉన్నారని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది. ఈ కేసులో ఇప్పటిదాకా 7 గురిని అరెస్టు చేసినట్లు వివరించిన జీపి.

Related Posts
సంక్రాంతి నుంచి తెలంగాణ రైతుభరోసా పథకం..?
rythu bharosa

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పథకం కేవలం సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి Read more

న్యూఇయర్ కి హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగింపు!
Hyderabad Metro

హైదరాబాద్ నగరం నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు సిద్దమవుతుండగా, హైదరాబాద్ మెట్రో రైలు తన సేవలను డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కూడా పొడిగించనున్నట్లు ప్రకటించింది. ఈ Read more

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ
Congress government has failed to implement promises KCR

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని పార్టీ Read more

సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం
telangana talli

హైదరాబాద్‌లోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇది సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించేలా, ఎత్తైన పీఠం Read more