allu

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితుల‌కు బెయిల్!

న‌టుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్ప‌డిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బ‌న్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈరోజు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

ఇక నిన్న అక్రమంగా బన్నీ ఇంటి గేటులోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీల‌ను ప‌గ‌ల‌గొట్టి విధ్వంసం సృష్టించారు.

రేవ‌తి మ‌ర‌ణానికి అల్లు అర్జునే కార‌ణ‌మంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోప‌లికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీ తేజ గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలుసు. ఈ కేసులో అల్లు అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల అయ్యారు.

Related Posts
తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఐసెట్ 2025 పూర్తి షెడ్యూల్ విడుదల

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ Read more

కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ – సీఎం రేవంత్
kcr kishan revanth

తెలంగాణలో రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. "కేసీఆర్ కోసం కిషన్ రెడ్డి Read more

తెలంగాణ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి Read more

పెళ్ళికి నిరాకరించడంతో ప్రేమ జంట ఆత్మహత్య
పెళ్ళికి నిరాకరించడంతో ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్ ప్రేమజంట బలవన్మరణం ప్రేమ అనేది సమాజంలో చాలా విలువైన అనుబంధంగా గుర్తించబడుతుంది. కానీ ప్రేమలో ఉన్న జంటలకు ఎదురయ్యే కష్టాలు, సంఘర్షణలు, కుటుంబ ఒత్తిళ్ళు కొన్నిసార్లు Read more