imd warns heavy rains in ap and tamil nadu next four days

అల్పపీడనం ప్రభావం తో ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలతో రైతుల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పుడు అల్ప పీడన ప్రభావం తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

Related Posts
బిజెపి ప్రచార పాట: ఢిల్లీ ఎలక్షన్స్‌లో రాముని ప్రేరణ
బిజెపి ప్రచార పాట: ఢిల్లీ ఎలక్షన్స్‌లో రాముని ప్రేరణ

భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ప్రచార పాటను ఆవిష్కరించింది. ఈ పాట 'జో రామ్ కో లేకర్ ఆయే, Read more

టాలీవుడ్ కు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
AP Sarkar gave good news to

ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్రపరిశ్రమకు ముఖ్యమైన సింగిల్ విండో సిస్టంను విశాఖపట్నంలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రక్రియ ద్వారా చిత్రీకరణ అనుమతులు సులభతరం అవుతాయి, తద్వారా చిత్రపరిశ్రమకు మరిన్ని Read more

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ..ఎందుకు?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ ఎందుకు

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు వేడుకలూ, కలవరలూ రేపుతున్నాయి. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య భేటీకి హాజరైనట్లు తాజా సమాచారం వస్తోంది. ఈ సమావేశం Read more

ఝార్ఖండ్‌లో భట్టివిక్రమార్క బిజీ బిజీ
Bhatti's key announcement on ration cards

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ Read more

×