KTR key comments on Amrit tenders

అమృత్ టెండర్ల పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు అమృత్ పథకంలో జరిగిన అవకతవకలపై మీడియాతో మాట్లాడుతూ.. కొందరు బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమైందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారని.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుతోందని ఎద్దేవా చేశారు.

అమృత్ టెండర్లలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొత్తం 8 ప్యాకేజీలుగా అమృత్ పథకానికి టెండర్లను పిలిచారని.. ఎలాంటి అర్హత లేకపోయినా శోదా కంపెనీ కి టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన బావమరిది సృజన్‌రెడ్డి కి టెండర్లను అప్పగించారని ఆరోపించారు. మొత్తం రూ.8,888 వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరిపించి రద్దు చేయాలని తాము ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరామని గుర్తు చేశారు.

తెలంగాణలో ఆర్‌ఆర్‌ టాక్స్‌ (రేవంత్, రాహుల్ ట్యాక్స్) రాజ్యం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు టెండర్ల వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదని తెలిపారు. బావమరిదికి అమృతం పంచి అప్పనంగా రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రూ.2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని అన్నారు. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్‌లను అప్పగిస్తే.. అధికార దుర్వినియోగం కిందకు రాదా అని ఆక్షేపించారు.

మనీ లాండరింగ్‌కు పాల్పడిన సోనియా, చౌహాన్ సహా చాలామంది పదవులు కోల్పోయారని.. త్వరలోనే రేవంత్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులు కూడా పోవడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారని గుర్తు చేశారు. నేడు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతున్నా.. ప్రధాని ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

Related Posts
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
anil

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్న Read more

దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?
how many companies india

ఇప్పటి వరకు 5,216 విదేశీ కంపెనీలు 2025 జనవరి 31 నాటికి 28 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ దేశంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న Read more

రేపు సీఎల్పీ సమావేశం
revanth

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ Read more

జీఐఎస్ సమావేశాన్ని ప్రారంభించనున్న మోదీ
జీఐఎస్ సమావేశాన్ని ప్రారంభించనున్న మోదీ

ఫిబ్రవరి 24న ఇక్కడ ప్రారంభమయ్యే రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 23న మధ్యప్రదేశ్‌కు చేరుకోనున్న మోదీ, ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *