chandrababu

అమరావతి నిర్మాణానికి రూ. 2,723 కోట్ల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలి
జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. జగన్ అమరావతి అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

Advertisements
Related Posts
ఏపీకి కేంద్రం భారీ నిధులు
modi, chandra babu

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఏపీ ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితుల్లో కేంద్ర నిర్ణయం ఉపశమనంగా మారనుంది. కేంద్రంలో…రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో Read more

నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ntr cinema vajrotsavam

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు నందమూరి తారకరామారావు నటుడిగా అరంగేట్రం చేసిన మనదేశం సినిమాకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో సినీ Read more

5 రోజుల్లో మహాకుంభమేళాకు ఎన్ని కోట్లలో భక్తులు వచ్చారంటే..!!
కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్‌స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే Read more

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్
AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more

×