హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో మయూర్ పాన్ షాపు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగడం ప్రారంభమైంది. మంటలు బాగా ఎగిసిపడి చుట్టుపక్కల వ్యాపించడంతో, పక్కనే ఉన్న హోటల్‌కి కూడా తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో దాదాపు 10 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.
ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రాణ నష్టం, మరియు ఆస్తి నష్టం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.