rav2

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాలను ప్రముఖ సినీ నటుడు సూరావఝుల సుధాకర్ (శుభలేఖ సుధాకర్) సందర్శించారు.

రావులపాలెం :
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాలను ప్రముఖ సినీ నటుడు సూరావఝుల సుధాకర్ (శుభలేఖ సుధాకర్) సందర్శించారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వచ్చిన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి చిత్ర పటం అందజేసారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకట రమణమూర్తి ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటం, చరిత్ర పుస్తకంతో సత్కరించారు.

Related Posts
ఆత్మగౌరవం కోసమే నా పోరాటం – మంచు మనోజ్
manoj ps

టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో అంతర్గత గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య Read more

అర్జున్ ఫ్యామిలీకి భారీ నష్టం..
aha

అల్లు అర్జున్ ఫ్యామిలీ కి భారీ నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీ లో అల్లు అరవింద్ అంటే తెలియని వారు ఉండరు. చిరంజీవి బావమరిదిగా , నిర్మాతగా , Read more

దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
game changer jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ Read more

ఐదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి రానున్న సినిమా..ఎప్పుడంటే?
ఐదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి రానున్న సినిమా..

టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, తన డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే క్రేజ్ ను సాధించాడు. ఈ సినిమాతో సిద్దు, యూత్ ఫాలోయింగ్ లో భారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *