Salary of Ambani car driver

అంబానీ కారు డ్రైవర్​ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ముఖేశ్ అంబానీ..పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు.. పారిశ్రామికవేత్తలలో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వేలాది కోట్లను వెనకేసుకుంటున్నాడు. ఈ సంస్థ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్స్, రిటైల్ వంటి అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ సంస్థ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. లక్షల కోట్ల ఆస్తులు కలిగివున్న అంబానీ ఇంట్లో పని వారికి కూడా భారీగానే జీతం ఉంటుందనే సంగతి చెప్పాల్సిన పనిలేదు. అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం నెలకు అక్షరాల రూ. 2 లక్షలు. ఇది ఏడేళ్ల కిందటి మాట.

Advertisements

2017 నాటి లెక్కల ప్రకారం, అంటే ఏడేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ.24 లక్షలు వేతనంగా చెల్లించారు. అదే ఇప్పుడు సుమారు ఇంతకు రెండింతల వరకు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది. అంటే సుమారు నెలకు రూ.4 లక్షల వరకు, ఏడాది మొత్తంగా చూస్తే 48 లక్షల వరకు జీతం అందుతుందన్న మాట. చాలా మంది ప్రముఖుల ఇళ్లల్లో పనిచేస్తున్న డ్రైవర్ల జీతాలు భారీగా ఉంటాయి. ఎందుకంటే వారు ప్రొఫెషనల్ డ్రైవర్లుగా సర్టిఫికెట్‌ కలిగి ఉంటారు. వారంతా ఎంతో కఠినమైన శిక్షణ పొంది ఉంటారు. ప్రయాణీకులకు అత్యంత భద్రత కల్పిస్తారు. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడమే కాకుండా, వాటి టెక్నాలజీ, మెయింటెనెన్స్ ల పై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా ఇలాంటి ప్రొఫెషనల్ డ్రైవర్లను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. ఆ ఏజెన్సీలే వారికి శిక్షణ కూడా ఇస్తాయి. మరి అంత శిక్షణ తీసుకున్న వారు నెలకు వేలల్లో జీతం తీసుకోరు కదా..!!

Related Posts
హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ 2025
CEEW brings eco friendly cartoons to Hyderabad Literature Festival 2025

హైదరాబాద్ : కౌన్సిల్ ఆన్ ఎనర్జీ , ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) యొక్క ప్రతిష్టాత్మక కార్టూన్ సిరీస్ అయిన వాట్ ఆన్ ఎర్త్!® (WOE), హైదరాబాద్ Read more

మార్కెట్ లోకి ఐఫోన్ 16ఈ విడుదల
మార్కెట్ లోకి ఐఫోన్ 16ఈ విడుదల

యాపిల్ తన తాజా మోడల్ ‘ఐఫోన్ 16ఈ’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇదే సమయంలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ‘ఐఫోన్ ఎస్ఈ 4’ Read more

విజయవాడలో 25వ ఏప్రిలియా RS457ను డెలివరీ చేసిన ఇన్నోవియా మోటర్స్
Innovia Motors delivered Aprilia RS457 on 25th in Vijayawada

విజయవాడ: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియా కోసం అధీకృత రిటైలర్ అయిన ఇన్నోవియా మోటర్స్, ఈరోజు విజయవాడలోని Read more

Donald Trump: భారత్‌, చైనాలపై టారిఫ్స్ భారం ఎంత?
భారత్‌, చైనాలపై టారిఫ్స్ భారం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే ‘పరస్పర సుంకాలు’ (రెసిప్రోకల్ టారిఫ్స్) ప్రకటించారు. అయితే ఆయా దేశాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. వీటిని డిస్కౌంట్ Read more

×