Sea plane fares available to all. Services to start in 3 months. Rammohan Naidu

అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లో సేవలు ప్రారంభం : రామ్మోహన్‌ నాయుడు

విజయవాడ: నేడు విజయవాడ – శ్రీశైలం మధ్య “సీ ప్లేన్” ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ ప్లేన్ టికెట్ రేట్లపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. టికెట్ రేట్లపై ఊహాగానాలే తప్ప.. సరిగ్గా ఇంత ధర ఉంటుందన్న విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ ను మన ఏపీలో ప్రారంభించబోతున్నారు. దీనిపై తాజాగా కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో తొలిసారి సీ ప్లేన్ సేవలు ఏపీలో ప్రారంభం కావడం మనకి గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో గుజరాత్ లో సీ ప్లేన్ ను ప్రారంభించే ప్రయత్నాలు జరిగినా.. అవి సఫలం కాలేదన్నారు.

Advertisements

‘‘చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నేను కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి అయ్యాను. చంద్రబాబు నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. సివిల్ ఏవియేషన్ అంటే అందరూ ఎయిర్ పోర్టులలో కనిపించే ప్లేన్లు అని అనుకుంటారు. కానీ అంతకంటే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. ఏవియేషన్ రంగంలో ఉన్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పనిచేయాలని నాకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మార్గదర్శనం మేరకు నేను పనిచేశాను. విమానయాన సంస్థల ప్రతినిధులు, నిపుణులతో చర్చించి సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన అన్ని విధివిధానలను రెడీ చేశాం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్దనున్న పున్నమి ఘాట్‌కు సీ ప్లేన్‌ చేరుకుంది. కాసేపట్లో బ్యారేజీ నుంచి శ్రీశైలం దాకా సీ ప్లేన్‌లో సీఎం చంద్రబాబు ప్రయాణించనున్నారు. ఈనేపథ్యంలో పున్నమి ఘాట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 మంది కూర్చునేలా సీ ప్లేన్‌‌లో సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

సామాన్యుడు సీ ప్లేన్ లో ప్రయాణించేలా ధర అందుబాటులో ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మరో 3,4 నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 రూట్లలో సీ ప్లేన్లను నడిపే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ – నాగార్జున సాగర్ , విజయవాడ – హైదరాబాద్ రూట్లకు కూడా ఆమోదం వచ్చిందని, అమరావతికి కనెక్ట్ చేసేలా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ట్రావెల్ కు మరో 4 నెలల సమయం పడుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. 2025 మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమిఘాట్ వద్ద నుంచి సీఎం సీ ప్లేన్ ను ప్రారంభించి.. అందులోనే శ్రీశైలం వరకూ ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎం శ్రీశైలంకు చేరుకోనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సీ ప్లేన్ లో 14 మంది కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. నీటిపైనే టేకాఫ్, ల్యాండింగ్ ఉంటాయి. సీ ప్లేన్ ద్వారా 30 నిమిషాల్లోనే శ్రీశైలంకు చేరుకోవచ్చు.

Related Posts
నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
cm revanth reddy district tour

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. వయనాడ్ ఉపఎన్నిక నేపథ్యంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీగా Read more

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు
clp meeting

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ (సీఎల్పీ) సమావేశం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా Read more

Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై నమోదైన పిటిషన్లు

జాతీయ గీతాన్ని అవమానించిన ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. పాట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తుండగా, Read more

×